సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 17 జులై 2019 (17:55 IST)

షాకింగ్ - సాహో రిలీజ్ వాయిదా..? జంకుతున్నారా?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం సాహో. ఈ సినిమాకి ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. యు.వి. క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. స్వాతంత్ర్య దినోత్స‌వ కానుక‌గా సాహో చిత్రాన్ని ఆగ‌ష్టు 15న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూద్దామా అని అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఆస‌క్తితో ఎదురుచూస్తుంటే... ఆగ‌ష్టు 15న సాహో రావ‌డం లేద‌ని తెలిసింది.
 
అందుక‌నే ఆగ‌ష్టు 15న శ‌ర్వానంద్ ర‌ణ‌రంగం, అడివి శేష్ ఎవ‌రు చిత్రాల‌ను రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. ఇంత‌కీ ఎందుకిలా జ‌రిగిందంటే... సాహో షూటింగ్ సోమ‌వారం పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చేయ‌డానికి కాస్త ఎక్కువ టైమ్ పడుతుంద‌ట‌. అందుక‌నే హ‌డావిడిగా చేయ‌డం కంటే మంచి క్వాలిటీతో అవుట్‌పుట్ ఇవ్వాల‌నే వాయిదా వేసార‌ని తెలిసింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఆగ‌ష్టు 30న రిలీజ్ చేస్తార‌ని తెలిసింది. ఐతే చిత్రం కంటెంట్ విషయంలో టీమ్ ఏమైనా జంకుతుందేమోనన్న చర్చ జరుగుతోంది.