బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

శర్వా మా ఇంటి హీరో.. రేపటి సూపర్‌స్టార్‌: ప్రభాస్‌ రాజు

శర్వానంద్ మా ఇంటి హీరో అని 'బాహుబలి' కథానాయకుడు ప్రభాస్ అన్నాడు. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మహానుభావుడు’. మెహరీన్‌ కథానాయిక. మారుతీ దర్శకుడు. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగ

శర్వానంద్ మా ఇంటి హీరో అని 'బాహుబలి' కథానాయకుడు ప్రభాస్ అన్నాడు. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మహానుభావుడు’. మెహరీన్‌ కథానాయిక. మారుతీ దర్శకుడు. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. 
 
ఈ కార్యక్రమానికి ప్రభాస్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'రన్‌ రాజా రన్' చిత్రం ఎవరో తీయాలని అనుకుంటున్నప్పుడు వంశీ.. శర్వా పేరు సూచించారు. ఆ సినిమాతో శర్వాకు మేమంతా ఫ్యాన్స్‌ అయిపోయాం. డైరెక్టర్‌ మారుతీ సినిమాలు బాగుంటాయి. పడి పడి నవ్వేలా చేస్తాయన్నారు. 
 
సాధారణంగా ఒక మనిషిని నవ్వించాలంటే మామూలు విషయం కాదు. ‘ప్రేమ కథా చిత్రమ్‌’, ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రాల్లాగానే ఇది కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. తమన్‌ చక్కని స్వరాలు సమకూర్చారు. చిత్ర బృందం ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. రేపటి సూపర్‌స్టార్‌ మన శర్వా’ అని అన్నారు.