సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: శనివారం, 30 జూన్ 2018 (17:25 IST)

ప్ర‌భాస్ సాహో లేటెస్ట్ అప్ డేట్ ఏంటి..?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న తాజా చిత్రం సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యు.వి.క్రియేష‌న్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌ల ఈ సినిమాలో కీల‌క‌మైన యాక్ష‌న్ ఎపిసోడ్‌ను దుబాయ్‌లో చిత్రీ

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న తాజా చిత్రం సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యు.వి.క్రియేష‌న్స్ సంస్థ  ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌ల ఈ సినిమాలో కీల‌క‌మైన యాక్ష‌న్ ఎపిసోడ్‌ను దుబాయ్‌లో చిత్రీక‌రించారు. దాదాపు రూ.90 కోట్ల భారీ వ్యయంతో జరిపిన ఈ దుబాయ్ చిత్రీకరణలో హెవీ ఛేజింగ్ సన్నివేశాలను షూట్ చేశారు. స్టంట్ కొరియోగ్రఫర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో ఈ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.
 
ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... 3వ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ జూలై 11న హైదరాబాద్‌లో ప్రారంభించ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని ప్రముఖ తారాగణం అంతా పాల్గొననున్నారు. దాదాపు 150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్ కాగా పలువురు బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో ఈ మూవీ పైన భారీ అంచ‌నాలు ఉన్నాయి. వ‌చ్చే సంవ‌త్స‌రం ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.