శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 30 జూన్ 2018 (11:16 IST)

రైలు జర్నీ కష్టాలు... హీరోయిన్‌కూ తప్పని వేధింపులు...

సమాజంలో లైంగిక వేధింపులు కేవలం సాధారణ మహిళలకు మాత్రమే కాదు.. సెలెబ్రిటీలకు కూడా తప్పడం లేదు. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్‌ ఈ వేధింపులతో భయపడిపోయింది. ఆమె పేరు మెహరీన్.

సమాజంలో లైంగిక వేధింపులు కేవలం సాధారణ మహిళలకు మాత్రమే కాదు.. సెలెబ్రిటీలకు కూడా తప్పడం లేదు. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్‌ ఈ వేధింపులతో భయపడిపోయింది. ఆమె పేరు మెహరీన్.
 
యువ హీరోలతో సినిమా చాన్స్‌లను కొట్టేసి, దక్షిణాది సినీ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. ఈమె ఓ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ నుంచి చెన్నైకు రైలులో బయలుదేరగా, ఈ ప్రయాణం ఆమెకు ఓ భయంకర అనుభూతిగా మారిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తమిళ చిత్రం 'నోటా'లో నటిస్తున్న ఆమె, సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ నుంచి చెన్నైకి ఆమె ప్రయాణం చేయాల్సి వుండగా, విమానంలో టికెట్ దొరకక పోవడంతో రైల్లో ప్రయాణించేందుకు అంగీకరించిందట. 
 
అయితే, తనకోసం బుక్ చేసిన బెర్తును అప్పటికే మరో ప్రయాణికుడు ఆక్రమించుకున్నాడు. పైగా, అతను పీకలవరకు మద్యం సేవించివుండటంతో అతన్ని పలుకరించేందుకు మెహరీన్ భయపడిపోయింది. దీంతో ఇకచేసేదేం లేక రైలులోనే నిలబడి ప్రయాణించిందట. 
 
ఆ తర్వాత పరిస్థితిని నిర్మాతకు ఫోన్‌ చేసి చెప్పడంతో ఆయన ఒక కారులో తన మనుషులను పంపి ఆమెను అదే కారులో చెన్నైకి తీసుకురావడానికి ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని నోటా చిత్ర బృందం వెల్లడించింది.