మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 25 జూన్ 2018 (10:48 IST)

స్టాలిన్‌కు తమిళనాడు గవర్నర్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకు?

డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌కు తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన పర్యటనలను అడ్డుకున్నా.. అడ్డుతగిలినా జైలుకెళ్లాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు

డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌కు తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన పర్యటనలను అడ్డుకున్నా.. అడ్డుతగిలినా జైలుకెళ్లాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
 
తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన భన్వరిలాల్ పురోహిత్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అలాగే, జిల్లా కేంద్రాల్లో ఆయన ప్రభుత్వ అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. దీన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా, డీఎంకే నేతలు, కార్యకర్తలు గవర్నర్ పర్యటన సమయంలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ ఆందోళనలకు దిగుతున్నాయి. దీంతో గవర్నర్ పర్యటన ఉద్రిక్తంగా మారుతోంది. 
 
ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ కార్యాలయం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ విభాగాలను సమీక్షించడం తన విధి అని, తన పర్యటనల్లో నిరసనలు తెలిపినా, అడ్డుకునేందుకు ప్రయత్నించినా జైలుకు వెళ్లాల్సి వుంటుందని గవర్నర్ హెచ్చరించారు. రాజ్యాంగపరంగా గవర్నర్‌కు కొన్ని విశేషాధికారాలు ఉంటాయని, వాటిని ఎవరూ అడ్డుకోకూడదని గుర్తుచేశారు. ఐపీసీ సెక్షన్ 124 కింద గవర్నర్‌కు రక్షణ లభిస్తుందని, ఆయన్ను అడ్డుకునేందుకు చూస్తే, ఏడేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చని పేర్కొంది. 
 
మరోవైపు, గవర్నర్ ప్రకటనపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ స్పందించారు. ఆయన ఫక్తు రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జైలుకు పంపుతానని బెదిరించడాన్ని ఖండించారు. గవర్నర్ స్వయంగా వెళ్లి ప్రభుత్వ విభాగాలను తనిఖీ చేయడమంటే, సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టేనని, గవర్నర్ పర్యటనల్లో నల్ల జెండాలతో నిరసనలు కొనసాగిస్తామని స్టాలిన్ స్పష్టంచేశారు.