మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2018 (12:28 IST)

అల్లు అర్జున్ కామెంట్ నాకు ప్రత్యేకం: బన్నీతో ప్రియా వారియర్ సినిమా?

సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్‌కు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె నటన, సైగలకు ఫిదా అయ్

సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్‌కు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె నటన, సైగలకు ఫిదా అయ్యాడు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ ప్రశంసలపై ప్రియా వారియర్ స్పందించింది. మలయాళ సినీ పరిశ్రమలో చాలా పాప్యులారిటీ ఉన్న స్టైలిష్ స్టార్ చేసిన ట్వీట్‌పై ప్రియా ప్రకాశ్ హర్షం వ్యక్తం చేసింది. 
 
ఓ కార్యక్రమంలో ప్రియా వారియర్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ ఇచ్చిన కాంప్లిమెంట్ ఎప్పటికీ  మర్చిపోలేనని తెలిపింది. అభిమానుల నుంచి తనకు ఇంతటి ఆదరణ లభించినా, అల్లు అర్జున్‌ ఇచ్చిన కాంప్లిమెంట్ చాలా ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చింది. తమ రాష్ట్రంలో ఆయనకు అభిమానులు ఎక్కువని చెప్పింది. కాగా ప్రియా వారియర్ త్వరలో అల్లు అర్జున్ సరసన నటించబోతోందని.. ఇందుకు సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాలతో పాటు కేరళ సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఇదిలా ఉంటే.. ప్రియ ప్రకాశ్ వారియర్ నటించిన ''ఒరు ఆధార్ లవ్‌'' చిత్రంలోని ''మాణిక్య మలరయ పూవీ'' పాటను తొలగించాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు కేరళకు చెందిన పలువురు తమ మద్దతును తెలుపుతున్నారు. ఈ క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా తన మద్దతును ప్రకటించారు. 
 
ఈ పాట వివరాన్ని, పుట్టు పూర్వోత్తరాలను కూడా తెలిపిన పినరయి ఇందులో అభ్యంతరం లేదంటూ వ్యాఖ్యానించారు. అయితే సీఎం ప్రజా సమస్యలను పక్కనబెట్టి.. ఓ సినిమా పాటకు మద్దతివ్వడం ఏంటని విపక్షాలు మండిపడుతున్నాయి.