శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (21:14 IST)

పుష్ప ట్రైలర్ టీజ్: 29 సెకన్ల వీడియోలో క్లియర్‌గా లేదు

పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తొలి భాగం రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
 
విడుదల తేది దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ఈరోజు పుష్ప ట్రైలర్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ ట్రైలర్‌కు బదులు ట్రైలర్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. 
 
ట్రైలర్ అంటేనే సినిమా కంటెంట్ ఏంటో చెప్పనట్టుగా చెప్తూ మూవీపై ఇంట్రెస్ట్ కలిగించేది. కానీ పుష్ప ట్రైలర్ టీజ్ పేరుతో విడులదయిన ఈ 29 సెకన్ల వీడియోలో ఏ పాత్రను కూడా క్లియర్‌గా చూపించలేదు సుకుమార్. ట్రైలర్ కావాలంటే డిసెంబర్ 6 వరకు వేచిచూడాల్సిందే అని స్పష్టం చేశాడు.