శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 24 మార్చి 2019 (10:41 IST)

నేను ఐరన్ లెగ్ కాదు.. ఎదుగుదలను అడ్డుకోలేరు : రకుల్ ప్రీత్ సింగ్

సినీ ఇండస్ట్రీలో నాది ఐరెన్ లెగ్ కాదనీ, పైగా తన ఎదుగుదలను ఏ ఒక్కరూ అడ్డుకోలేరని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ఈమె సినీ కెరీర్ ఆరంభంలో వరుస విజయాలు వరించాయి. ఆ తర్వాత వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. దీంతో ఆమె కెరీర్‌పై లేనిపోని చర్చ సాగుతోంది.
 
దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ, తన గురించి ఎన్ని కట్టు కథలను ప్రచారం చేసినా తన ఎదుగుదలను మాత్రం ఏ ఒక్కరూ అడ్డుకోలేరన్నారు. మూడు భాషల్లో నటించే అతి కొద్ది మందిలో తాను ఒకరిని కావడం సంతోషంగా ఉందన్నారు. తన ఎదుగుదలను అడ్డుకోవడానికి కొందరు సామాజిక మాధ్యమాల్లో వదంతులు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. అలాంటి తప్పుడు ప్రచారం గురించి పట్టించుకునే సమయం తనకు అస్సలు లేదన్నారు. 
 
కాగా, సినిమాలు ఎవరిని ఎప్పుడు ఉన్నత స్థాయికి తీసుకెళతాయో, ఎవరిని ఎప్పుడు కింద ప‌డేస్తాయే తెలియదు. ఇపుడు అవకాశాలు లేని వారు రేపు చేతినిండా చిత్రాలతో బిజీగా ఉండొచ్చు. అలాంటి హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ అమ్మడు మొదట్లో కోలీవుడ్‌లో ఐరన్‌లెగ్‌గా ముద్ర వేసుకుంది. కానీ టాలీవుడ్‌లో సక్సెస్‌ అయ్యింది. వరుస పెట్టి యంగ్‌ స్టార్స్‌తో నటించేసింది. అంతే టాప్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను తెచ్చుకుంది. ప్రస్తుతం సూర్య సరసన నటించిన ఎన్‌జీకే చిత్రం, శివకార్తికేయన్‌కు జంటగా నటిస్తున్న మరో చిత్రాలనే నమ్ముకుంది.