బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (13:20 IST)

బాబాయ్ "భీమ్లా నాయక్" ట్రైలర్‌పై అబ్బాయ్ రివ్యూ

"భీమ్లా నాయక్" ట్రైలర్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ అదిరిపోయిందని అన్నాడు. పవన్ కళ్యాణ్ గారి ప్రతి డైలాగ్, యాక్షన్ పవర్ ఫుల్‌గా ఉందని, తన మిత్రుడు రానా దగ్గుబాటి నటన, అతడి ప్రజెన్స్ హై లెవల్‌గా ఉందన్నాడు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి చరణ్ ఆల్ ది బెస్ట్ తెలియచేశాడు.
 
ఇకపోతే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "భీమ్లా నాయక్" . సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయగా, పలు రికార్డులను నెలకొల్పుతూ దూసుకుపోతుంది.