శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (12:52 IST)

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్.. ఆంక్షలు ఉల్లంఘిస్తే అంతే సంగతులు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. నిన్న జరగాల్సిన ప్రీ రిలీజ్ వేడుక ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా వాయిదాపడడంతో, గురువారం ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 
 
ఈ వేడుకను పురస్కరించుకుని పోలీసులు ఆంక్షలు విధించారు.  పాసులు లేకుండా గ్రౌండ్ దగ్గరకు వచ్చి గుమిగూడటానికి అనుమతి లేదని పేర్కొన్నారు. ఫిబ్రవరి 21వ తేదీతో జారీచేసిన పాసులు చెల్లవు, కొత్త పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి లభించనుంది. 
 
జూబ్లీహిల్స్ రోడ్ నెం.5 నుంచి యూసఫ్ గూడా వైపు వచ్చే వాహనాలు కమలాపురి కాలనీ రోడ్డును ఎంచుకోవాలి. అమీర్‌పేట్ నుంచి యూసఫ్ గూడా మీదుగా జూబ్లీహిల్స్ వెళ్లే వాహనాలు గణపతి కాంప్లెక్స్ మీదుగా కమలాపురి కాలనీ, ఇందిరా నగర్ మీదుగా వెళ్లాలి.
 
ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చే వారు తమ వాహనాలను నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే పార్క్ చేయాలని, రోడ్ల మీద పార్క్ చేస్తే వాహనాలను సీజ్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.