సింహాలను దత్తత తీసుకున్న రాంచరణ్ శ్రీమతి ఉపాసన, ఆహారం కోసం రూ. 2 లక్షల చెక్
మెగాపవర్ స్టార్ సతీమణి ఉపాసన కొణిదెల సామాజిక సేవ చేయడంలో ముందు వుంటుంటారు. అలాగే వన్యప్రాణులపై దయ చూపుతుంటారు. పక్షులు, జంతువులకు తోచిన సాయం చేస్తుంటారు.
ఇందులో భాగంగా శనివారం నాడు హైదరాదాబ్ నెహ్రూ జూలాజికల్ పార్కును సందర్శించిన ఆమె విక్కీ, లక్ష్మీ అనే రెండు సింహాలను దత్తత తీసుకున్నారు. ఆ సింహాలకు సంబంధించి సంరక్షణ బాధ్యతలన్నీ ఏడాది పాటు తనే చూసుకుంటానని తెలిపారు. ఇందుకు గాను రూ. 2 లక్షల చెక్కును అందజేశారు.
ఉపాసన దత్తత సింహాలను దత్తత తీసుకోవడంపై పార్క్ క్యూరేటర్ మాట్లాడుతూ... జూలో వున్న రెండు సింహాలను దత్తత తీసుకుని వాటి సంరక్షణ బాధ్యత తీసుకున్న ఉపాసనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరికొందరు ముందుకు రావాలని ఆకాంక్షించారు.