గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (11:10 IST)

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిజమైన 'గ్యాంగ్ లీడర్' : మెగా కోడలు

తెలుగు చిత్ర పరిశ్రమలో నిజమైన గ్యాంగ్ లీడర్ చిరంజీవి అని మెగా కోడలు ఉపాసన వ్యాఖ్యానించారు. తన మామ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు.. మెగా అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. 
 
ఈ చిత్ర హీరో చిరంజీవి, యూనిట్‌ను సామాన్యులతోపాటు సినీ ప్రముఖులు ప్రశంసలు ముంచెత్తుతున్నారు. ఇలాంటి వారిలో మెగా కోడలు, 'సైరా' నిర్మాత రామ్‌ చరణ్ భార్య ఉపాసన కూడా తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. సైరా చిత్రాన్ని వీక్షించిన తర్వాత ఆమె ట్వీట్ చేశారు. 'మెగాస్టార్ సాధించారు. ఆయన నిజమైన గ్యాంగ్ లీడర్. తండ్రికి కొడుకు ఇచ్చిన అత్యుత్తమ బహుమతి ఇది. మెగాస్టార్ కోడలిగా గర్విస్తున్నా. రామ్‌చరణ్ భార్యగా గర్వపడుతున్నా' అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.