సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (10:43 IST)

ఎమోషన్స్ - ఎక్స్‌పీరియన్స్ కలయికే సైరా... సుధీర్ బాబు

చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి చిత్రాన్ని వీక్షించిన సినీ సెలెబ్రిటీస్ తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, మహేష్ బాబు వంటి వారు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాజాగా హీరో సుధీర్ బాబు కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 
 
'ఎమోష‌న్స్‌, ఎక్స్‌పీరియెన్స్ క‌ల‌యికే "సైరా న‌ర‌సింహారెడ్డి". మెగాస్టార్ లెజెండ్రీ పెర్ఫామెన్స్ చేశారు. నేను చూసిన ఇంట‌ర్వెల్ ఫైట్స్‌లో ఇదొక బెస్ట్ ఫైట్. ర‌త్న‌వేలు స‌న్నివేశాల‌ను గ్రాండియ‌ర్‌గా చూపించారు. ఎపిక్ చిత్రాన్ని చేశారు. రామ్‌చ‌ర‌ణ్ నిర్మాణ విలువ‌ల్లా పెర్ఫామెన్స్‌లు రిచ్‌గా ఉన్నాయి' అంటూ ట్వీట్ చేశారు.
 
మరోవైపు, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని మెగాస్టార్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. సినిమా హాళ్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. అభిమానులతో కోలాహలంగా మారాయి. 
 
తెలుగు బిడ్డ నరసింహారెడ్డి కథను అత్యద్భుతంగా తెరకెక్కించారని ఉద్వేగానికి గురవుతున్నారు. ఇలాంటి సినిమా రాబోయే రోజుల్లో చూడము.. చూడలేమన్న రీతిలో ఉందని ఆనందం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకు మరింత కలిసివచ్చిందని తెలిపారు. కథ, నటీనటుల నటన అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ఈ సినిమా అన్ని రికార్డులను బద్ధలు కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.