బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (11:18 IST)

కట్టప్పను ఎవరు చంపారు ? జగన్‌ సర్కార్‌‌పై ఆర్జీవీ ఫైర్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సొంత రాష్ట్రం ఏపీలో టిక్కెట్లను రూ.200లకు విక్రయించేందుకు కూడా అనుమతించకపోవడం ఒక ప్రశ్నను లేవనెత్తుతుందని.. కట్టప్పను ఎవరు చంపారు? అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. జగన్‌ సర్కార్‌, టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు మధ్య టికెట్ల ధరల వివాదం చెలరేగుతూనే ఉంది. 
 
ఈ నేపథ్యంలో కట్టప్పను ఎవరు చంపారు ? అంటూ జగన్‌ సర్కార్‌‌పై మండిపడ్డారు వర్మ. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్ ధర రూ. 2200/-కి మహారాష్ట్రలో అనుమతి ఇచ్చారని, ఉత్తరాది రాష్ట్రాల్లో ఐనాక్స్ చిహ్న మల్టీప్లెక్స్ చైన్ ఆర్‌ఆర్‌ఆర్‌ టిక్కెట్లను రూ. 2200కి విక్రయిస్తోందన్నారు. 
 
కానీ సొంత రాష్ట్రం ఏపీలో టికెట్లను రూ. 200/-కి విక్రయించడానికి కూడా అనుమతించకపోవడం ఒక ప్రశ్నను లేవనెత్తుతుందని "కట్టప్పను ఎవరు చంపారు? " అంటూ ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌‌గా మారింది.