శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 మే 2022 (16:44 IST)

ది వారియర్ పాట రికార్డు.. 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్

ram pothineni
రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా తమిళ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది వారియర్. ఈ సినిమాలోని ఓ పాట రికార్డు సృష్టించింది. 
 
తాజాగా ఈ సినిమాలో రామ్ ఎంట్రీకి ఒక మాస్ సాంగ్ డిజైన్ చేశారు. శేఖర్ మాస్టర్‌ కొరియోగ్రఫీలో 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఈ మాస్ సాంగ్‌ని షూట్‌ చేశారు. 
ఇంతమందిని ఓ సాంగ్ లో వాడటం ఇదే మొదటిసారి. 
 
ఈ సినిమాలో రామ్ కోసం 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో డ్యాన్స్ చేయించి సరికొత్త రికార్డు సృష్టించారు. శనివారంతో ఈ పాట షూట్ ముగియగా, సినిమా షూటింగ్‌ కూడా మొత్తం పూర్తయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఈ సినిమాను తమిళ్, తెలుగు భాషల్లో జులై 14న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో మొదటి సారి రామ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు.