గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 25 మే 2022 (19:32 IST)

11:11 మూవీ నుంచి యూత్‌ఫుల్ సాంగ్ విడుదల చేసిన రామ్ పోతినేని

Ram Pothineni, Rajiv Salu and others
Ram Pothineni, Rajiv Salu and others
గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీగా 11:11 సినిమాను రూపొందిస్తున్నారు నిర్మాత గాజుల వీరేష్ (బళ్లారి). కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా రాబోతున్న ఈ సినిమాను టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. RK నల్లూరి దర్శకత్వం వహిస్తుండగా సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉన్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూత్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. హీరో రామ్ చేతుల మీదుగా విడుదల చేసిన ఈ పాట ఏమయ్యిందో మనసైపోయే మాయం అంటూ యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది.
 
పాటలో హీరోహీరోయిన్లపై షూట్ చేసిన సన్నివేశాలతో పాటు కోటి అందించిన మ్యూజిక్ మేజర్ హైలైట్ అయ్యింది. తన ప్రేయసి ప్రేమ కోసం ప్రియుడు తన ఫీలింగ్స్ బయటపెడుతున్నట్లు ఈ సాంగ్ రాశారు రాకేండు మౌళి. ఈ సాంగ్ విడుదల చేసిన అనంతరం సాంగ్ చాలా బాగా వచ్చిందని తెలిపారు హీరో రామ్. ఈ మేరకు చిత్రయూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెబుతూ సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నారు.  
 
ఈ 11: 11 చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, దగ్గుబాటి రానా చేతులమీదుగా వదిలిన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా విడుదల చేసిన ఈ సాంగ్ సినిమా పట్ల ఆసక్తి పెంచేసింది.  హీరో రాజీవ్ సాలూర్- హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మధ్య లవ్ ట్రాక్, అందులో అనూహ్యంగా ఎంటరైన ఓ వ్యక్తి, అతన్ని హతమార్చడం అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌‌తో ఈ మూవీ రూపొందింది. అతిత్వరలో ఈ చిత్ర విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్. 
 
 
నటీనటులు : 
రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్, రోహిత్, కోటి సాలూర్, సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు 
 
సాంకేతిక వర్గం 
బ్యానర్: టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తికా ఫిలిమ్స్
నిమాటోగ్రఫీ: ఈశ్వర్
ఎడిటర్: రవి మాన్ల
డైలాగ్స్: పవన్ కె అచల
మ్యూజిక్ : మణిశర్మ
ప్రొడ్యూసర్: గాజుల వీరేష్ (బళ్లారి)
లైన్ ప్రొడ్యూసర్: సందీప్ గాలి 
స్టోరీ-స్క్రీన్ ప్లే- డైరెక్షన్: RK నల్లూరి
పీఆర్వో: సాయి సతీష్, రాంబాబు పర్వతనేని