Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

రామాయణం 25వ సంవత్సరంలోకి ప్రవేశించింది

Updated: బుధవారం, 14 ఏప్రియల్ 2021 (17:56 IST)
Bala ramayanam
రామాయణం లేదా బాల రామాయణం 1997లో అందరూ పిల్లలతో నిర్మించిన పౌరాణిక తెలుగు సినిమా. ఇది గుణశేఖర్ దర్శకత్వంలో మల్లెమాల సుందర రామిరెడ్డి నిర్మించారు. ఇందులో జూనియర్ఎన్.టి.ఆర్ రామునిగా నటించాడు. ఈ చిత్రం భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు . ఉత్తమ బాలల సినిమా గా ఎంపికచేయబడినది. ఏప్రిల్ 14, తేదీకి 24 ఏళ్ళూ పూర్తిచేసుకుని 25 ఏట ప్ర‌వేశించింది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ట్వీట్ చేశాడు.ఈ చిత్రం అందరూ బాలనటులతోనే రూపొంది ఆ రోజుల్లో ఓ చరిత్ర సృష్టించింది. ఈ చిత్ర నిర్మాణంలో నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చారు. తెలుగువారు గర్వించేలా చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ నాటి మేటి హీరో జూనియర్ యన్టీఆర్ కు ఇది తొలి చిత్రం. ఇక ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా లభించింది. 
 
ఇదిలా వుండ‌గా, రామాయ‌ర‌ణం సినిమా 25ఏట ప్ర‌వేశించడం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేస్తూ ఆయ‌న సోష‌ల్ మీడియాలో పెట్టారు. ఆ చిత్రానికి  సంగీతం మాధవపెద్ది సురేష్ఎ, ల్.వైద్యనాధన్ నిర్వ‌హించారు. నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్, కె.ఎస్.చిత్ర, జేసుదాసు, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి, గీతరచన మల్లెమాల సుందర రామిరెడ్డి, ఉండేల భుజంగరాయశర్మ (పద్యాలు), సంభాషణలు ఎమ్.వి.ఎస్.హనుమంతరావు, ఛాయాగ్రహణం శేఖర్ వి. జోసఫ్.
 
కాగా, ఈ ఏడాది ఆయ‌న స‌మంత‌తో శాకుంత‌లం సినిమా తెర‌కెక్కిస్తున్నారు. ఇది పౌరాణిక క‌థ‌లోని ఓ భాగానికి చెందిన సినిమా కావ‌డం విశేషం. ఇప్ప‌టికే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రుపుకుంటోంది.

అన్నీ చూడండి

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కోసం ప్రజలతోనే యుద్ధమా : కాక్రోచ్ జనతా పార్టీ

ఎనిమిది యుద్ధాలు ఆపాను ..8 నోబెల్ శాంతి పురస్కారాలు రావాలి: డోనాల్డ్ ట్రంప్

పీజీ వైద్య విద్యార్థినిపై ఎంబీబీఎస్ విద్యార్థి అత్యాచారం...

మీలో ఒకడిగా పుట్టలేదు.. కానీ మీలో ఒకడిని అయ్యాను : పవన్ కళ్యాణ్ (వీడియో)

నేపాల్‌ దేశంలో మళ్లీ వరదలు - నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన గృహాలు

అన్నీ చూడండి

నిలబడి మంచినీళ్లు తాగకూడదా? ఎందుకని?

బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం

మటన్ కైమా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఈ దీపావళి వేళ, మీ ప్రతి స్నేహితునికీ బాదం పప్పులను బహుమతిగా ఇవ్వండి

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?

తర్వాతి కథనం
Show comments