మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2023 (16:18 IST)

రామ్‌చరణ్‌ 16ఏళ్ల కెరీర్‌ సందర్భంగా రంగస్థలం స్పెషల్‌ జాతర

Rangasthalam special shows poster
Rangasthalam special shows poster
చిరంజీవి వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన రామ్‌చరణ్‌ 2007లో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో చిరుతతో తెరంగేట్రం చేశాడు. అలా ఒక్కోచిత్రానికి ఒక్కోమెట్టు ఎక్కుతూ సుకుమార్‌ దర్శకత్వంలో 2018లో రంగస్థలంలో నటించాడు. అది సూపర్‌ డూపర్‌ హిట్‌. మాస్‌ హీరోగా చరణ్‌కు ఒక మైలురాయిలా నిలిచింది. ఆ తర్వాత ఆర్‌.ఆర్‌.ఆర్‌. రాజమౌళి సినిమాతో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగాడు. ఆయన పుట్టినరోజు 27వ తేదీ. సినీరంగ కెరీర్‌ కూడా అదేరోజుతో 16ఏళ్లకు చేరుకుంటుంది.
 
అందుకే ఆయన అభిమానుల కోరిక మేరకు రంగస్థలం చేసి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్‌ 27వ తేదీన పలు స్పెషల్‌ షోస్‌ ప్రదర్శిస్తున్నారు. ఈరోజు రాత్రి 8గంటలకు హైదరాబాద్‌లోని క్రాస్‌ రోడ్‌లో సంథ్య థియటర్‌లో అభిమానుల జాతరకు రెడీ అవుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్‌,  రాజమండ్రి, నెల్లూరు, అనంతపూర్‌లలో కూడా ఇదేరోజు రంగస్థలం స్పెషల్‌ స్క్రీనింగ్‌ జరగనుంది. ఆయా చోట్ల రాంచరణ్ ఫాన్స్ ప్రముఖులు పాల్గొననున్నారు. 
 
రాంచరణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మించారు.