సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 8 జూన్ 2024 (14:59 IST)

ఉషాకిరణ్ సంస్థకు గౌవరం సమాజ కథలను వెలికి తీసిన ఘనత రామోజీరావుదే

pratighatana, mayuri
pratighatana, mayuri
రామోజీరావుగారు సినిమా నిర్మాణంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేశారు. 1983 లో ఉషాకిరణ్ మూవీస్ ను స్థాపించి వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారు. ప్రేమలేఖ నవల ఆధారంగా జంథ్యాల దర్శకత్వంలో 84 లో శ్రీవారికి ప్రేమ లేఖ తీసి సూపర్ హిట్ చేశారు. ఈసారి కథలను నిజజీవితంలో పాత్రల ఆధారంగా తీసుకుని మయూరి వంటి సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఓ కాలులేని నాట్యకారిని జీవిత ఆధారంగా ఇది రూపొందింది. ఈ సినిమా జనాల్లో రెండు దశబ్దాలపాటు నిలిచిపోయింది. అందుకే ఉషాకిరణ్ మూవీస్ లో తప్పనిసరిగా సినిమా చేయాలని చాలామంది నటీనటులు ఎదురుచూసేవారు. 
 
అనంతరం తనకు జరిగిన అన్యాయాన్ని నిరాహారదీక్ష తో పోరాడి దక్కించుకున్న కథతో మౌన పోరాటం నిర్మించారు. ఇది ఒడిసాలో జరిగిన నిజ సంఘటన ఆదారంగా తెరకెక్కించారు. ఇదంతా ఓ భాగమైతే టి.క్రిష్ణ దర్శకత్వంలో విజయశాంతి లీడ్ రోల్ గా ప్రతిఘటన సినిమా తీసి సినిమా చరిత్రను తిరగరాశారు. ఈ సినిమాను మొదట్లో చూస్తారోలేదో నని సందిగ్థంలో వున్నా సమకాలీన అంశాలు, నటీనటుల అభినయంతో జాతీయ స్థాయిలో పేరుతెచ్చిపెట్టింది. ఈసినిమాతోనే రాజశేఖర్ మరింత పాపులర్ అయ్యారు. కోట శ్రీనివాసరావు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఇక అక్కడ నుంచి ఆయన వెనుకడుగువేయలేదు.
 
ఇక మారథాన్ నేపథ్యంలో అశ్వని చిత్రాన్ని రియల్ ప్లేయర్ అశ్వీనీ నాచప్పతో తెరకెక్కించారు. తేజ, మనసు మమత, నువ్వేకావాలి, అమ్మ జడ్జిమెంట్, పీపుల్స్ ఎన్ కౌంటర్, బెట్టింగ్ బాలరాజు, నచ్చావులే, నువ్విలా వంటి సినిమాలు తీశారు. జూ. ఎన్.టి.ఆర్.ను నిన్ను చూడాలనుంది సినిమా తీసి నటుడిగా పరిచయం చేసిన ఘటన రామోజీరావుదే. ఆ తర్వాత గోపీచంద్ తోనూ తొలివలపు తీసి ఆయన కెరీర్ ను శ్రీకారం చుట్టారు.  అదేకాకుండా సమాజంలోని కథలను తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లోనూ తిరిగి నిర్మించిన ఘనత ఉషాకిరణ్ మూవీస్ దే.

కె. విజయభాస్కర్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం నువ్వే కావాలి.  ఇందులో తరుణ్, రిచా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించగా, స్రవంతి రవికిషోర్ ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాట్లాడు రాశారు. 2000లో విడుదలై సెన్సషనల్ అయింది. అప్పటి యూత్ ఈ సినిమా కోసం ఎగబడ్డారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కావడంతో చాలా  చోట్ల ఈ సినిమా ధాటికి  తట్టుకోలేక థియేటర్లో వేరే సినిమాలు తీసి నువ్వే కావాలి. సినిమా వేయాల్సి వచ్చింది. ఇదే అప్పట్లో గొప్ప రికార్డు. 
 
యమున, శ్రీకాంత్, ఎన్.టి.ఆర్. చరణ్ రాజ్, గొోపీచంద్, ఉదయ్ కిరణ్,రీమాసేన్ ఇలా ఎందరినో పరిచయంచేశారు. సినిమా నిర్మాణం తర్వాత దాన్ని పంపిణీ చేసే విధంగా మయూరి డిస్ట్రిబ్యూట్ వ్యవస్తను స్థాపించారు. ఇక సినిమా షూటింగ్ లన్నీ చోట జరిగేలా ఫిలిం సిటీని స్థాపించి వేల సినిమాలు తయారు అయ్యేలా చేశారు. ఆయన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మరియు స్టూడియో యజమాని. 
 
మారుతున్న కాలాన్ని అనుగుణంగా తాజాగా వెబ్ సిరీస్ ను కూడా రూపొందించి సక్సెస్ బాటలో పయనించారు. అయితే వీటన్నింటినీసమన్వయంతో నిర్వహించేలా తన సిబ్బంది తయారుచేసుకుని డిసిప్లిన్ గా చేయడంలో రామోజీరావుదే అగ్రస్థానం చెప్పక తప్పదు.