శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 2 మే 2018 (14:27 IST)

బాక్సాఫీస్ వద్ద నువ్వానేనా అంటున్న చెర్రీ - ప్రిన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రిన్స్‌ మహేష్ బాబులు బాక్సాఫీస్ వద్ద నువ్వానేనా అంటూ పోటీపడుతున్నారు. వీరిద్దరు నటించిన "రంగస్థలం", "భరత్ అనే నేను" చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. పైగా, ఇవి కలెక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రిన్స్‌ మహేష్ బాబులు బాక్సాఫీస్ వద్ద నువ్వానేనా అంటూ పోటీపడుతున్నారు. వీరిద్దరు నటించిన "రంగస్థలం", "భరత్ అనే నేను" చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. పైగా, ఇవి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఈ రెండు చిత్రాలు పాత రికార్డులను చెరిపేస్తూ కొత్త రికార్డులను లిఖించే దిశగా దూసుకెళుతున్నాయి.
 
సూపర్ స్టార్ మహేష్ బాబు, కైరా అద్వాని జంటగా నటించిన "భరత్ అనే నేను" సినిమా బాక్సాఫీస్ వద్ద తన హవాను కొనసాగిస్తూనే ఉంది. ఏప్రిల్ 20న విడుదలైన ఈ సినిమా ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. ఈ సినిమా మొదట అనుకున్న దానికంటే ముందుగా రిలీజ్ అవడం.. ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ అని టాక్ రావడం.. దీని కలెక్షన్లను నిలువరించే పోటీ సినిమా మరొకటి లేకపోవడం.. ఈ చిత్రం హవా కొనసాగుతోంది. 
 
దీంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజా నివేదికల ప్రకారం లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం సినిమా రిలీజైన 12వ రోజుకు 3 మిలియన్ ట్రేడ్ మార్క్‌ను అమెరికాలో దాటేసింది. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే 5 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను రాబట్టింది. ట్రేడ్ అనలిస్ట్, ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాలా ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. 
 
ముఖ్యంగా, 'భరత్ అనే నేను' చిత్రం ఈనెల 30వ తేదీ వరకు యూఎస్ఏలో 3,192,011 డాలర్లు (రూ.21.32 కోట్లు), ఏప్రిల్ 29వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో 443,974 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 2.23 కోట్లు) రాబట్టిందని రమేష్ బాలా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
అలాగే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' కూడా విదేశాల్లోనే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పిన విషయం తెల్సిందే. 'రంగస్థలం' సినిమా రిలీజ్ అయిన నెల రోజులకే ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లు రాబట్టింది. ఇపుడు భరత్ అనే నేను రూ.250 కోట్ల వరకు కలెక్షన్ల్ రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఇలా చెర్రీ - ప్రిన్స్‌లు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నారు.