శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 1 మే 2018 (18:13 IST)

రూ. 200 కోట్లు కొల్ల‌గొట్టిన రంగ‌స్థ‌లం..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం రంగ‌స్థ‌లం. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన రంగ‌స్థ‌లం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న రంగ‌స్థ‌లం 3

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం రంగ‌స్థ‌లం. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన రంగ‌స్థ‌లం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న రంగ‌స్థ‌లం 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేస్తే... 30 రోజుల‌కు 200 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి మ‌రో రికార్డ్ సొంతం చేసుకుంది.
 
ఇక షేర్ విషయానికొస్తే... ఇప్పటివరకు ఈ సినిమా రూ.116 కోట్ల షేర్‌ను రాబట్టుకుని డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాల్ని అందించింది. ఇప్పటికీ సి సెంటర్లలో మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌టం విశేషం. ఓవర్సీస్‌లో 3.5 మిలియన్ డాలర్లకు దగ్గరైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాల్లో నాన్ బాహుబలి-2 రికార్డుల్ని క్రియేట్ చేసింది. మ‌గ‌ధీర త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌కి ఆ స్థాయిలో విజ‌యాన్ని అందించింది రంగ‌స్థ‌లం.