గురువారం, 28 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2024 (12:39 IST)

కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీల

P Sushila
P Sushila
ప్రముఖ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి.సుశీల తీవ్ర కడుపునొప్పితో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉండగా, సుశీలమ్మ జాగ్రత్తగా వైద్య పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 
 
ఆమె అద్భుత గాత్రంతో సంగీత పరిశ్రమలో చెరగని ముద్ర వేసింది. ఉత్తమ మహిళా గాయనిగా ఐదు భారతీయ జాతీయ అవార్డులు, 2008లో ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్‌ అందుకున్నారు. అత్యధిక పాటలు పాడినందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 12వేలకు పైగా తెలుగు పాటలు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ, సింహళం, బెంగాలీలతో సహా పలు భాషల్లో మొత్తం 40,000 పాటలను ఆమె ఆలపించారు.
 
1935లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో జన్మించిన సుశీల సంగీతంలో చేసిన ప్రయాణం ఆమెను శిఖరాగ్రానికి చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.