గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2024 (10:30 IST)

కేరళలో మంకీ ఫాక్స్.. గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు

Monkey pox
కేరళలో మంకీ ఫాక్స్ వ్యాధి సోకిన నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి, ఫీవర్‌ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు అందుబాటులోకి తెచ్చేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. 
 
మంకీ ఫాక్స్ వ్యాధి నివారణ చర్యలపై సచివాలయంలో మంత్రి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ, కేరళలో 30 చిన్నపాటి కేసులు నమోదయ్యాయని అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. 
 
మంకీ ఫాక్స్ నివారణ చర్యల్లో భాగంగా ఆసుపత్రుల్లో అవసరమైన మెడికల్ కిట్లు, మందులు, ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 
 
రాష్ట్రంలో మంకీఫాక్స్ నివారణకు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలు వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నివారణ మందులు, అవసరమైన కిట్‌లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.