మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (14:45 IST)

యష్‌కు షాకిచ్చిన రాఖీభాయ్.. కేజీఎఫ్‌కు కొత్త తలనొప్పి

కేజీఎఫ్ చిత్ర యూనిట్‌కు రియల్ రాఖీ భాయ్ షాకిచ్చాడు. కేజీయఫ్‌లో రాఖీ భాయ్ అనే పాత్ర నిజజీవితంలో నుండి తీసుకున్నదే అని గతంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించాడు.

కర్ణాటకకు చెందిన థంగం అనే వ్యక్తి కోలార్ గోల్డ్ గనుల్లో పనిచేస్తూ.. అక్కడ ఓ గ్యాంగ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. తన గ్యాంగ్ సహాయంతో కోలార్ గనుల్లో బంగారాన్ని కొల్లగొడుతూ జూనియర్ వీరప్పన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక తాను కొల్లగొట్టిన గోల్డ్‌ను ప్రజలకు కూడా పంచిపెట్టేవాడు.
 
1997లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో థంగం మృతి చెందాడు. ఇప్పుడు అతడి కథనే 'కేజీయఫ్' సినిమాలో చూపించారంటూ థంగం తల్లి పాలీ ఆరోపిస్తుంది. 
 
తమను సంప్రదించకుండానే, తన కొడుకు కథను ఎలా సినిమా తీస్తారని.. తాను చట్టపరంగా ముందుకు వెళ్తానంటూ కేజీయఫ్ చిత్ర టీమ్‌కు షాకిచ్చింది ఈ రియల్ లైఫ్ రాఖీ భాయ్ తల్లి. దీంతో కేజీయఫ్ చిత్ర యూనిట్‌కు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది.