గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (19:46 IST)

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ట్రిబుల్ "ఆర్"

ఈ నెల25వ తేదీన "ఆర్ఆర్ఆర్" చిత్రం విడుదలకానుంది. దీంతో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం నిమగ్నమైవుంది. ఇందులోభాగంగా, ట్రిబుల్ ఆర్‌లు కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. 
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళిలు తెరాస ఎంపీ సంతోష్‍‌తో కలిసి ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. 
 
ఈ సందర్భంగా ఆ ముగ్గురికి సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అదే సమయంలో వారి తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ ఘన విజయం సాధించాలని కూడా తెరాస ఎంపీ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.