1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 18 జులై 2022 (20:18 IST)

స్పార్క్‌లో మ‌రో హీరోయిన్‌గా రుక్సార్‌ ధిల్లాన్‌

Ruksar Dhillon
Ruksar Dhillon
హై బడ్జెట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది స్పార్క్. ఈ సినిమాలో చార్మింగ్‌ బ్యూటీ మెహ్రీన్‌  పిర్జాదా మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విక్రాంత్‌ ఈ సినిమాతో పరిచయమవుతున్నారు. ఇటీవల లావిష్‌ ఈవెంట్‌ చేసి మరీ సినిమాను ప్రారంభించారు మేకర్స్. హృదయమ్‌ ఫేమ్‌ హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఈ సినిమాకు ట్యూన్స్ అందిస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేస్తోంది స్పార్క్.
ఇదే జోరులో ఇప్పుడు మేకర్స్ మరో హీరోయిన్‌ పేరు కూడా ప్రకటించారు. స్టన్నింగ్‌ బ్యూటీ రుక్సార్‌ ధిల్లాన్‌ ఈ సినిమాలో నటిస్తున్నారు. విశ్వక్‌సేన్‌తో అశోకవనంలో అర్జున కల్యాణం లాంటి బిగ్‌ సక్సెస్‌ తర్వాత రుక్సార్‌ సైన్‌ చేసిన ప్రాజెక్ట్ ఇది.
 
అరవింద్‌ కుమార్‌ రవి వర్మ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి వర్మ ఇంతకు మునుపు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు కాబట్టి సినిమాటోగ్రఫీని కూడా హ్యాండిల్‌ చేస్తున్నారు.
 
అందమైన లొకేషన్లలో షూటింగ్‌ జరుపుకుంటోంది. డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా స్పార్క్. విక్రాంత్‌ కి సూపర్‌ డూపర్‌ లాంచ్‌ అవుతుందనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో వెన్నెల కిశోర్‌, సత్య, శ్రీకాంత్‌, కిరణ్‌ అయ్యంగార్‌, అన్నపూర్ణమ్మతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.