బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (14:01 IST)

సాచి చిత్రం హిట్ అవ్వాలి : రెబెల్ స్టార్ ప్రభాస్

Sachi team with prabhas
Sachi team with prabhas
బిందు అనే ఒక నాయి బ్రాహ్మీన్  అమ్మాయి నిజ జీవిత గాధను ఆధారంగా చేసుకుని ఒక మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంలా కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి చక్కగా తెరకెక్కించిన చిత్రం "సాచి". ఈ చిత్రాన్ని ఉపేన్ నడిపల్లి, వివేక్ పోతగోని నిర్మాణ సారధ్యములో వివేక్ పోతగోని దర్శకుడిగా రూపొందించారు. ఈ చిత్రం ట్రైలర్ ను రెబెల్ స్టార్ ప్రభాస్ విడుదల చేసారు.
 
అనంతరం రెబెల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ "సాచి ట్రైలర్ చూసాను. చాలా బాగుంది. మహిళా సాధికారత కు సంభందించిన చిత్రం ఇది. ఈ చిత్రాన్ని సత్యానంద్ గారు సమర్పించగా వివేక్ పోతగోని నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి హిట్ అవ్వాలి" అని కోరుకున్నారు.
 
దర్శక నిర్మాత వివేక్ పోతగోని మాట్లాడుతూ "సాచి నిజజీవిత కథ. బిందు అనే ఒక నాయి బ్రాహ్మీన్  అమ్మాయి నిజ జీవిత గాధ. మహిళా సాధికారత కు సంభందించిన చిత్రం ఇది. మా చిత్ర ట్రైలర్ ను హీరో ప్రభాస్ గారు విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈమధ్యనే సాచి చిత్రాన్ని పలువురు ప్రముఖులకు ప్రివ్యూ వేసాము. తెలంగాణ నాయీ బ్రాహ్మీన్  అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్ గారు మా చిత్రాన్ని చూసి హర్షం వ్యక్తం చేసారు. మా చిత్రం మార్చి 3న విడుదల చేస్తున్నాము. ఈ చిత్రం అందరికి నచ్చుతుంది" అని చెప్పారు.
 
ఈ చిత్రములో సంజన రెడ్డి, గీతిక రధన్ హీరోయిన్స్ గా నటించగా, చెల్లి స్వప్న, అశోక రెడ్డి మూలవిరాట్, టివి రామన్, ఏవిఎస్ ప్రదీప్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. KV భరద్వాజ్ సంగీత దర్శకునిగా, ప్రసన్న కుమార్ పాటలు, పెద్దింటి అశోక్ కుమార్, వివేక్ పోతగోని మాటలు అందించారు. ఈ  చిత్రానికి కథ,మాటలు, స్క్రీన్ ప్లే, ఫోటోగ్రఫీ, మరియు దర్శకత్వ బాధ్యతలను వివేక్ పోతగోని వహించారు.