శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (15:45 IST)

24న నాగ చైతన్య - సాయిపల్లవి 'లవ్‌స్టోరీ'

అక్కినేని నాగ చైతన్య, సాయి ప‌ల్ల‌వి జంటగా నటించిన చిత్రం లవ్‌స్టోరీ. శేఖర్ కుమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 10వ తేదీన రిలీజ్ చేస్తామని తొలుత ప్రకటించారు. కానీ, ఈ చిత్రాన్ని ఈ నెల 24వ తేదీన థియేటర్‌లో రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. 
 
ఈ లవ్‌స్టోరీ చిత్రాన్ని వరుణ్ తేజ్ - సాయిపల్లవి నటించిన 'ఫిదా' తరహాలోనే తెరకెక్కించారు. భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే బరువైన కథ. తెలంగాణలో జరిగే ఒక అందమైన ప్రేమకథ. ఫస్టులుక్ పోస్టర్ దగ్గర నుంచి ఈ సినిమా యూత్‌లో ఆసక్తిని పెంచుతూ వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో వినాయ‌క చ‌వితి పండుగ సంద‌ర్భంగా మూవీ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. కొన్ని కార‌ణాల వ‌ల‌న చిత్రం వాయిదా వేయాల్సి వ‌చ్చింద‌ని, సెప్టెంబ‌ర్ 24న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్స్‌లో విడుద‌ల కానుంద‌ని ప్ర‌క‌టించారు. ఇక అభిమానులు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసేందుకు సిద్ధం కండి.
 
మరోవైపు, ఈ చిత్రంలోని ‘సారంగధరియా’ పాట ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పవన్ సీహెచ్ స్వరపరిచిన ఈ పాట, జానపద కథ అయిన ‘సారంగధరుడు’ నుంచి వచ్చిందనే చెప్పొచ్చు. 
 
సారంగద‌రియా పాట సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. సీనియర్ హీరోయిన్ దేవయాని కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, రావు రమేశ్ .. పోసాని ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.