మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (11:44 IST)

ఆది పురుష్ తాజా అప్డేట్: లంకేష్ షూటింగ్ పూర్తి

Lankesh
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ భామ కృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ఆది పురుష్. పౌరాణిక రామాయణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో రవనుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సైఫ్ అలీ ఖాన్ తన షూటింగ్ పూర్తి చేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. 
 
ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర బృందం సమక్షంలో సైఫ్ అలీ ఖాన్‌తో కేక్ కట్ చేపించి వీడ్కోలు పలికారు.ఇక పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 
 
బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోగా ఈసారి రాముడి పాత్రలో ప్రభాస్ అలరించనున్నారు. దాంతో ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కృతిసనన్ సీత పాత్రలో కనిపించబోతోంది.