సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 2 నవంబరు 2017 (14:03 IST)

హైదరాబాదులో సమంత, నాగచైతన్య రిసెప్షన్: నవంబర్ 12న ఫిక్స్ అయ్యిందా?

టాలీవుడ్ ప్రేమపక్షులు నాగచైతన్య, సమంత ఒకింటి వారైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 6న చైతూ, సమంత వివాహం గోవాలో అట్టహాసంగా జరిగిన సంగతి విదితమే. గోవాలో పెళ్లి తంతు ముగిసిన వేళ.. హైదరాబాదులో సమ్మూ, చైతూ రిసెప

టాలీవుడ్ ప్రేమపక్షులు నాగచైతన్య, సమంత ఒకింటి వారైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 6న చైతూ, సమంత వివాహం గోవాలో అట్టహాసంగా జరిగిన సంగతి విదితమే. గోవాలో పెళ్లి తంతు ముగిసిన వేళ.. హైదరాబాదులో సమ్మూ, చైతూ రిసెప్షన్ వుంటుందని అందరూ అనుకున్నారు. అయితే వీరి వివాహ రిసెప్షన్ రద్దు అయ్యిందని ఆపై వార్తలు వచ్చాయి. 
 
రిసెప్షన్‌కు అయ్యే ఖర్చును పేద పిల్లల కోసం ఖర్చు చేస్తే సరిపోతుందని సమంత చెప్పడంతో అది క్యాన్సిల్ అయ్యిందని వార్తలొచ్చాయి. ఈ గ్యాప్‌లో దగ్గుబాటి కుటుంబం ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ ఇటీవలే చెన్నైలో జరిగింది. చెన్నైలో నాగచైతన్య తల్లి లక్ష్మీ అక్కడి స్నేహితుల కోసం ఓ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దగ్గుబాటి కుటుంబ సభ్యులంతా హజరయ్యారు.
 
ఈ నేపథ్యంలో త్వరలోనే హైదరాబాద్‌లో జరగబోయే రిసెప్షన్‌కు అక్కినేని కుటుంబం​ గ్రాండ్‌‌గా ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్‌ 12న ఈ వేడుకను నిర్వహించనున్నారట. ప్రస్తుతం షూటింగ్‌‌ల నుంచి విరామం తీసుకున్న ఈ జంట రిసెప్షన్‌ తరువాత తిరిగి షూటింగ్‌లకు హజరయ్యేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ వివాహ రిసెప్షన్ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తారని తెలుస్తోంది.