ఎనర్జీకి వ్యాయామమే కారణమంటున్న సమంత, చైతు
హీరో హీరోయిన్లకు ఆరోగ్యం బాగుండాలంటే వ్యాయామం అవసరం. గ్లామర్‌గా కనిపించాలన్నా హుషారుగా వుండాలన్నా అందరూ కసరత్తులు చేస్తుంటారు. ఇక లాక్‌డౌన్ సమయంలో అందరూ జిమ్‌లలో ఎక్కువ కాలం వెచ్చిస్తున్నారు. అందులో తామున్నామని నాగచైతన్య, సమంత తెలియజేస్తున్నారు. రోజుకు గంటల తరబడి వ్యాయామం చేస్తుంటామని తెలియజేస్తూ అందుకు సంబంధించిన పిక్స్‌ను పోస్ట్ చేశారు. ఇటీవల సమంత చేసిన ది ఫ్యామిలీమేన్2 సినిమాలో రెబల్‌గా నటించిన ఆమె ఆ పాత్ర కోసం యాక్షన్ సన్నివేశాలు చేయాల్సివచ్చింది. అందుకు నేను చేసే వ్యాయామం బాగా ఉపయోగపడిందని చెబుతోంది.
అదేవిధంగా నాగ చైతన్యకూడా తన హుసారుగా వుండేండుకు ఆరోగ్యంగా వుండేందుకు వ్యాయామమే కీలకంటున్నాడు. సమంత మరియు నాగ చైతన్యలు తమ హోమ్ జిమ్ లో రెగ్యులర్ గా గంటలకు గంటలు వర్కౌట్స్ చేస్తూనే ఉన్నారని వారి సన్నిహితులు అంటున్నారు. నాగచైతన్య ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న థ్యాంక్యూ సినిమా కూడా ముగింపుకు వచ్చేసింది. ఈ సమయంలో మరో సినిమా ను ఆయన కమిట్ అయ్యారట. కొత్తగా కమిట్ అయిన సినిమా కోసం ఆయన సిక్స్ ప్యాక్ చేస్తానని హామీ ఇచ్చారట. అందుకే చైతూ చాలా కష్టపడుతూ సమంత తో కలిసి గంటలకు గంటలు జిమ్ లో వర్కౌట్ లు చేస్తున్నారట.