మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఆగస్టు 2022 (13:34 IST)

మాలీవుడ్‌ నుంచి కబురందుకున్న సమంత

Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhu
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం, యశోద చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలోని 'ఖుషి' చిత్రంలో నటిస్తున్నారు సమంత.
 
ఈ నేపథ్యంలో సమంత ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి కబురు అందుకుంది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా అభిలాష్‌ జోషి దర్శకత్వంలో 'కింగ్‌ ఆఫ్‌ కోథా' అనే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా తెరకెక్కనుంది.
 
ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు చిత్రయూనిట్‌ సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ యాడ్‌లో దుల్కర్, సమంత కలిసి నటించిన సంగతి తెలిసిందే. తాజాగా దుల్కర్‌తో సినిమా వార్త నిజమైతే సమంతకు మలయాళంలో ఇదే తొలి సినిమా అవుతుంది. అలాగే హిందీ, కన్నడంలో కూడా సమంత సినిమాలు చేయలేదు.
 
అయితే బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌ కుమార్, ఆయుష్మాన్‌ ఖురానా, రణ్‌వీర్‌ సింగ్‌లతో సినిమాలు చేసేందుకు సమంత అంగీకరించారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.