గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (12:33 IST)

సందీప్ కిషన్ తో సంక్రాంతి బుల్లోడా ! మాజాకా! అనిపించనున్న త్రినాధ రావు నక్కిన

Sandeep Kishan In Majaka
Sandeep Kishan In Majaka
రాబోయే సంక్రాంతికి అగ్ర హీరోలు థియేటర్లలో లైన్ లో వుండగా, సందీప్ కిషన్ తో మజాకా అనిపించేందుకు  దర్శక నిర్మాత త్రినాధ రావు నక్కిన బరిలోకి దిగినట్లు ప్రకటించారు. సందీప్ కిషన్  30వ సినిమాకి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తాసహ నిర్మాత. ఈ హెల్తీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, రిలీజ్ టైం రివిల్ చేయడం ద్వారా మేకర్స్ ప్రమోషన్‌లను ప్రారంభించారు.
 
ఈ చిత్రానికి 'మజాకా' అనే టైటిల్ పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సందీప్ కిషన్ పర్ఫెక్ట్ సంక్రాంతి బుల్లోడుగా కనిపించారు. సంప్రదాయ పట్టు పంచె, చొక్కా ధరించి, తన భుజంపై పెద్ద టేప్ రికార్డర్‌తో కుర్చీపై కూర్చుని కనిపించారు. సంక్రాంతి పండగని తలపించిన ఈ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. కలర్‌ఫుల్‌గా వున్న ఫస్ట్ లుక్ ప్లజెంట్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది.
 
ఈ మూవీలో రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, దర్శకుడు త్రినాధరావు నక్కినతో అసోషియేషన్ ని కొనసాగిస్తూ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాశారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు, మేకర్స్ త్వరలో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.