సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 2 మే 2024 (16:39 IST)

లాంఛనంగా హైదరాబాద్‌లో సర్పంచ్ సినిమా ప్రారంభం

Jatti Ravikumar  Boinapally Hanumantha Rao and others
Jatti Ravikumar Boinapally Hanumantha Rao and others
జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్ పై జట్టి రవికుమార్ M.A. దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న చిత్రం సర్పంచ్ ప్రారంభోత్సవ వేడుకలు నేడు ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోయినపల్లి హనుమంతరావు (జాతీయ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల జాతీయ అధ్యక్షుడు), సీతారామస్వామి ఉపాసకులు శ్రీశ్రీశ్రీ పెండ్యాల సత్యనారాయణ, హైకోర్టు అడ్వకేట్ కుడికాల ఆంజనేయులు,  బి. రమేష్, అంజనీ, జట్టి రజిత, అక్షర జ్ఞాన, అనోగ్న, జ్ఞాన సిద్ధార్థ, అంబేద్కర్ శాస్త్రి, బంటు ప్రవీణ్, పోతరాజు, ప్రశాంత్, సంపత్, బంటు ఆశ్రిత, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 
బోయినపల్లి హనుమంతరావు మాట్లాడుతూ : మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు. కరీంనగర్ గాంధీగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ సినిమా రంగ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు జట్టి రవికుమార్ గారికి ధన్యవాదాలు. ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్ ద్వారా వస్తున్నాయి సినిమా మంచి విజయం సాధించాలని. ముందు ముందు ఈ బ్యానర్ ద్వారా ఇంకా మంచి సినిమాలు వచ్చి దిన దినాభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
నిర్మాత, దర్శకుడు జట్టి రవికుమార్ మాట్లాడుతూ : మనిషిని ముందుండి నడిపించేది జ్ఞానం అందుకని జ్ఞాన ఆర్ట్స్ అని అదేవిధంగా సినిమా సక్సెస్ కి కారణం ప్రేక్షకుడు అందుకని జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలింస్ అని పెట్టాం. ఈ సినిమాని జూన్ 20న మొదలు పెట్టి 2025 కి పూర్తి చేస్తాం. ప్రేక్షకులందరికీ ఆదరణ సపోర్ట్ మాపై ఈ సినిమాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.