శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జనవరి 2022 (09:41 IST)

బాహుబలి ఫేమ్ కట్టప్పకు కరోనా

సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా వదిలిపెట్టట్లేదు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. 
 
గత కొన్ని రోజులుగా మహేష్ బాబు, మంచు లక్ష్మి, మంచు మనోజ్, విశ్వక్సేన్ మరియు తమన్‌తో సహా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తాము కరోనా మహమ్మారి బారిన పడ్డట్టు వెల్లడించారు. ప్రస్తుతం అగ్ర సినీ తారలు మాత్రమే కాకుండా సినీ పరిశ్రమకు చెందిన కమెడియన్లు కూడా కరోనా మహమ్మారి బారిన పడిన పరిస్థితి ఉంది. 
 
ఇక తాజాగా బాహుబలి సినిమా ద్వారా కట్టప్పగా అందరి మన్ననలు పొందిన సత్య రాజ్ కరోనా మహమ్మారి బారిన పడి ఆసుపత్రిలో చేరారు. 
 
చెన్నైలోని అమింజిక్కరైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో హుటాహుటిన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది.