శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (16:53 IST)

శ్రీదేవి మృతి పట్ల సచిన్ షాక్.. అతిలోక సుందరి చివరి సినిమా అదే..?

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. సినీ దిగ్గజం శ్రీదేవి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఈ లోకం విడిచిపోయిందనే వార్త జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. శ్రీదేవి మరణించడం నిజంగా చాలా బా

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. సినీ దిగ్గజం శ్రీదేవి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఈ లోకం విడిచిపోయిందనే వార్త జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. శ్రీదేవి మరణించడం నిజంగా చాలా బాధాకరం. నిద్రలేచిన వెంటనే ఆ వార్త విని కలత చెందినట్లు సచిన్ టెండూల్కర్ తెలిపారు. 
 
ఈ వార్త విని మాటలు రావడం లేదు. ఎందుకంటే మనమంతా ఆమెను చూస్తూనే పెరిగాం. ఉన్నట్టుండి ఆమె ఇక లేరన్న వార్త వినడం జీర్ణించుకోవడానికి కష్టంగా ఉందంటూ టెండూల్కర్ తెలిపారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు, ఆమెను అభిమానించే, ప్రేమించే వారందరికీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.
 
మరోవైపు శ్రీదేవి చివరి సినిమా షారూక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ''జీరో'' అని తెలుస్తోంది. వచ్చే డిసెంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.