1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2024 (23:07 IST)

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్.. తారల సందడి.. అంతా సిద్ధం

Anant Ambani, Radhika Merchant
Anant Ambani, Radhika Merchant
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో జూలై 12న ముంబైలో వివాహం జరగనుంది. పెళ్లికి ముందు, ఈ జంట ప్రీ-వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1 నుండి మార్చి 3 వరకు జరుగుతాయి.
 
ఈ ప్రీ-వెడ్డింగ్ వేడుక బాలీవుడ్ స్టార్స్‌కు వేదిక కానుంది. ఈ వేడుకలో అగ్ర తారలు పాల్గొంటారని తెలుస్తోంది. బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు అనంత్-రాధికల ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌కు హాజరవుతారు. 
 
ఇంకా అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, కాజోల్, రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, కరణ్ జోహార్, సైఫ్ అలీ ఖాన్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, శ్రద్ధా కపూర్, చుంకీ పాండే, బోనీ కపూర్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, ఆదిత్య చోప్రా, కరిష్మా కపూర్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్, ట్వింకిల్ ఖన్నా, రాణి ముఖర్జీ వేడుకల్లో భాగం కానున్నారు. అంతేగాకుండా రిహన్న, దిల్జిత్ దోసాంజ్, అరిజిత్ సింగ్, అజయ్-అతుల్‌ల సంగీత కార్యక్రమం వుంటుందని టాక్. 
 
సినీ తారలే కాకుండా, వ్యాపార, క్రీడ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఇటీవల, త్వరలో వివాహం చేసుకోబోతున్న అనంత్ జంట జామ్‌నగర్‌లో సాంప్రదాయ 'లగన్ లఖ్వాను' వేడుకతో తమ ప్రీ-వెడ్డింగ్ వేడుకలను ప్రారంభించారు. అనంత్- రాధిక జనవరి 2023లో ముంబైలోని యాంటిలియాలో సాంప్రదాయ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు.