గురువారం, 30 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

రక్షితారెడ్డితో హీరో శర్వానంద్ నిశ్చితార్థం

sharwanand engagement
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరోల్లో ఒకరిగా ఉన్న హీరో శర్వానంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈయనకు రక్షితారెడ్డితో గురువారం హైదరాబాద్ నగరంలో నిశ్చితార్థం జరిగింది. ఈ ఇద్దరు కుటుంబ సభ్యులు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, సన్నిహితుల సమక్షంలో ఈ నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా వధూవరులిద్దరూ ఉగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు తన క్లోజ్ ఫ్రెండ్, హీరో రామ్ చరణ్  తన సతీమణి ఉపాసనతో కలిసి హాజరయ్యారు. వీరిద్దరూ ఒకే రంగు (గులాబీ) దుస్తులు ధరించి వచ్చారు. 
 
శర్వానంద్- రక్షితారెడ్డిలతో కలిసి రామ్ చరణ్ - ఉపాసనలు కలిసి దిగిన ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, శర్వానంద్ పెళ్లి తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు. కాగా, రక్షితా రెడ్డి ఓ టెక్కీగా పని చేస్తున్నారు. ఈమె తండ్రి హైకోర్టు న్యాయవాదిగా కొనసాగుతున్నారు.