మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (14:12 IST)

శర్వానంద్ పెళ్లి పీటలెక్కనున్నాడా? వధువు ప్రేమలో?

టాలీవుడ్‌లో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. నిఖిల్ సిద్ధార్థ్, నితిన్, రానా దగ్గుబాటి ఇప్పటికే ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో.. శర్వానంద్ కూడా చేరబోతున్నాడని తెలిసింది. త్వరలో శర్వానంద్‌కు వివాహం కానుందని టాక్ వస్తోంది. తన చిన్ననాటి స్నేహితురాలు, మహిళా పారిశ్రామికవేత్తతో శర్వానంద్ వివాహం జరుగనున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
చిన్ననాటి స్నేహితురాలితో శర్వానంద్ ప్రేమలో వున్నాడని.. ఈ ప్రేమకు పెద్దల అనుమతి కూడా లభించిందని తెలుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే.. ఈ ఏడాది లోపు శర్వానంద్ వివాహం జరుగుతుందని  ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం శ్రీకారం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇంకా యూవీ క్రియేషన్ బ్యానర్‌పై మరో సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే ఈ బ్యానర్ కింద్ రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా అనే సినిమాల్లో శర్వానంద్ నటిస్తున్నాడు.