శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (19:33 IST)

కరోనావైరస్ టైంలో లవంగాలు ఎందుకు తీసుకోవాలంటే? (Video)

కరోనావైరస్ విజృంభిస్తోంది. ప్రస్తుతానికి దీనికి మందులు లేవు. ఐతే త్వరలో వ్యాక్సిన్ రాబోతోంది. ఈ వైరస్ ను ఎదుర్కొనేందుకు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం. అందుకోసం మన పెద్దలు ఎప్పుడో అనేక చిట్కాలు చెప్పారు. వాటిలో లవంగాలు గురించి తెలుసుకుందాం.
 
1. లవంగాలు తెల్ల రక్త కణాలను పెంపొదిస్తాయి. అలాగే జీవిత కాలాన్ని పెంపొందించే గుణాలు ఇందులో ఉన్నాయి. 
 
2. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. 
 
3. ఎలాంటి చర్మ వ్యాధినైనా లవంగాలు ఇట్టే మాయం చేసేస్తాయి. దీనిని చందనంతోపాటు రుబ్బుకుని లేపనంలా చర్మానికి పూస్తే చర్మ వ్యాధులు మటుమాయమంటున్నారు వైద్యులు.
 
4. లవంగాల నుంచి నూనె తీయనివి ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
5. ఎవరైనా కఫం, పిత్త రోగాల బారిన పడినవారుంటే ప్రతి రోజు లవంగాలను సేవిస్తుంటే ఈ జబ్బులు తగ్గుతాయి.
 
6. జీర్ణశక్తి తగ్గినట్లనిపిస్తే రెండు లవంగాలు తీసుకోండి. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
 
7. లవంగాలు సేవిస్తే ఆకలి బాగా వేస్తుంది. వీటి వలన జీర్ణక్రియకు అవసరమైన రసాలు ఉదరంలో ఊరుతాయంటున్నారు వైద్యులు.
 
8. లవంగాలను తీసుకోవాలనుకునేవారు కేవలం ఐదు లవంగాలను మాత్రమే సేవించాలి. అంతకుమించి వాడితే శరీరంలో వేడి చేస్తుంది. ఫలితంగా వేరే సమస్యలు ఉత్పన్నమవుతాయి.