మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (12:56 IST)

నాతో రోజూ మాట్లాడేవాడు.. ఓసారి నడిరోడ్డుపై..?: శిల్పాశెట్టి

టీనేజీలో తన ప్రేమాయణం గురించి బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి చెప్పుకొచ్చింది. ఓ టీవీ షోలో శిల్పాశెట్టి తన టీనేజీ లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది. తాను కాలేజీ చదివే రోజుల్లో తన క్లాస్‌మేట్ తనను ప్రేమించిన

టీనేజీలో తన ప్రేమాయణం గురించి బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి చెప్పుకొచ్చింది. ఓ టీవీ షోలో శిల్పాశెట్టి తన టీనేజీ లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది. తాను కాలేజీ చదివే రోజుల్లో తన క్లాస్‌మేట్ తనను ప్రేమించినట్లు నటించాడని తెలిపింది. "'నాతోపాటు చదువుకునే ఓ అబ్బాయి రోజు సాయంత్రం మా ఇంటికి ఫోన్ చేసేవాడు. నేను కూడా అతడితో మాట్లాడేదాన్ని. నన్ను ప్రేమిస్తున్నాడని అనుకున్నా. కానీ సీన్ రివర్సైంది'' అంటూ శిల్పాశెట్టి చెప్పింది.  
 
నాన్న ఇంట్లో వుంటే మాత్రం ఆ అబ్బాయితో మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేదాన్నని.. ఓ రోజు కలుసుకోవడానికి ఒకరోజు బస్ స్టాప్‌కు రమ్మని పిలిచాడు. అతడి కోసం చాలా సమయం అక్కడే ఎదురుచూశా. అతడు మాత్రం రాలేదు. తాను మోసపోయాననే సంగతి మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందని శిల్పా శెట్టి తెలిపింది.
 
అసలు సంగతి ఏంటంటే.. తన స్నేహితులతో అతడు పందెం కట్టాడని, తనను ప్రేమిస్తున్నట్లు నటించాడని వెల్లడి అయ్యిందని శిల్పాశెట్టి చెప్పింది.  ఇదంతా.. ఓ సినిమా కథలా అనిపించొచ్చు కానీ, ఇది నిజం. పందెంలో గెలవడం కోసమే అలా నటించిన అతను, తనతో బంధాన్ని తెంచుకున్నాడు. ఈ సంఘటన తనను ఆవేదనకు గురిచేయలేదని చెప్పనని.. చాలా రోజులు ఎంతో బాధపడ్డానని శిల్పాశెట్టి తెలిపింది.