శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: సోమవారం, 1 అక్టోబరు 2018 (20:08 IST)

RX 100 చిత్రం హీరోను చూసి ఇన్‌స్పైర్ అయి పెట్రోల్ పోసుకున్నారు...

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మిషన్ కంపౌండ్‌లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. ప్రేమ వ్యవహారంతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా మూడో వ్యక్తి హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మిషన్ కంపౌండ్‌లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. ప్రేమ వ్యవహారంతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా మూడో వ్యక్తి హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ప్రాధమికంగా ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య ఘటనకు సంబంధించిన వివరాలు విలేకరుల సమావేశంలో  వెల్లడించారు డిఎస్పీ వెంకట రమణ.
 
ఇద్దరు విద్యార్థులు కూడా లవ్ ఫెయిల్ కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఈ మధ్యనే వచ్చిన Rx 100 అనే సినిమాను చూసి ఇన్స్పైర్ అయ్యి అదే తరహాలో ఇద్దరు కలిసి పెట్రోల్ కొని తీసుకెళ్లి ముందుగా మద్యం సేవించి అనంతరం ఇద్దరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారని డిఎస్పీ వెంకట రమణ తెలిపారు.