శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2017 (09:46 IST)

దర్శకుడిని బూటు కాలితో తన్నిన అడిషినల్ డీసీపీ (వీడియో)

హైదరాబాద్ నగరంలో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిని విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు పిలిచిన మాదాపూర్ డీసీపీ గంగిరెడ్డి బూటు కాలితో తన్ని చెంపలు పగులగొట్టాడు.

హైదరాబాద్ నగరంలో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిని విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు పిలిచిన మాదాపూర్ డీసీపీ గంగిరెడ్డి బూటు కాలితో తన్ని చెంపలు పగులగొట్టాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి తనను వేధింపులకు గురిచేశాడంటూ నటి హారిక గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.
 
దీంతో మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి యోగిని తన కార్యాలయానికి పిలిపించుకుని... అతనిపై దారుణంగా ప్రవర్తించారు. పోలీసుల ఎదుటే యోగిని బూటు కాలితో నిర్దాక్షిణ్యంగా తన్ని, చెంపలు పగలగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ నిర్ఘాంతపోతున్నారు. 
 
విచారించడానికి ఓ పద్ధతి ఉంటుందని, అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి ఇంత నీచంగా ప్రవర్తించడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.