వ్యభిచారిణిగా బన్నీ హీరోయిన్?!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఆర్య. దీని సీక్వెల్‌గా ఆర్య -2 వచ్చింది. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. పైగా, ఈ చిత్రం సీక్వెల్‌గా సూపర్ హిట్ కొనసాగించింది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా, ఓ కీలక పాత్రలో శ్రద్దా దాస్ నటించింది. అయితే, ఈ చిత్రం హిట్ అయినప్పటికీ.. శ్రద్ధా దాస్‌కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు.
గతకొన్ని నెలలుగా శ్రద్ధా దాస్ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆమెకు ఓ మంచి ఛాన్స్ వచ్చింది. అదీకూడా ఓ ప్రయోగాత్మకమైన సినిమాలో నటిస్తుండటం విశేషం. ఈ ప్రయోగాత్మకమైన సినిమాలో శ్రద్దా దాస్ వేశ్యగా నటిస్తోందని తెలుస్తోంది. ఇందులో జగపతిబాబు హీరోగా చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ స్టార్ట్ అవుతుందట. మరి ఎలా ఉంటుందో చూడాలి.