ఐపీఎల్ 2020: వేలం పాటకు అంతా సిద్ధం.. ఆ జాబితాలో 332 మంది..?
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం జరుగనుంది. ఈ వేలం పాటలో 11 మంది తమిళ క్రికెటర్లకు మాత్రమే చోటుందని టాక్ వస్తోంది. 2020 ఏడాదికి గాను ఐపీఎల్ పోటీలు ఏప్రిల్‌లో జరుగనున్నాయి.
ఈ పోటీల్లో ఆడే క్రికెటర్లను వేలం పాట ద్వారా ఎంపిక చేయనున్నారు. కోల్‌కతాలో వేలం పాట గురువారం జరుగనుంది. ఈ వేలం పాటలో స్టార్ క్రికెటర్లను తీసుకునేందుకు జట్టు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి.
మొత్తం 148 విదేశీ క్రికెటర్లతో పాటు 332 మంది క్రికెటర్లు వేలం పాట జాబితాలో స్థానం సంపాదించారు. ఇందులో 73 మంది క్రికెటర్లను వేలం ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో 11 మంది తమిళ క్రికెటర్లు వున్నారు.
విదేశీ ఆటగాళ్లలో క్రిస్లిన్, మోర్గాన్, కమ్మిన్స్, జేమ్స్ నిషాం, క్రిస్లిన్‌లు భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసేందుకు జట్టు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి.