గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (13:41 IST)

రతన్ టాటా డేటింగ్ చేసిన బాలీవుడ్ నటి ఎవరు?

semi garewal - ratan tata
భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా భౌతికంగా దూరమయ్యారు. ఆయన బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన మరణం దేశంలోని ప్రతి ఒక్క పౌరుడినీ కలిసివేస్తుంది. దేశం ఓ రత్నాన్ని కోల్పోయిందని బాధాతప్తహృదయాలతో ఆయనకు నివాళులు అర్పిస్తుంది. ఈ క్రమంలోనే ఆయన ప్రేమ అంశం తెరపైకి వచ్చింది. 
 
ఆయన వయసులో ఉన్న సమయంలో బాలీవుడ్ నటి సిమి గెరేవాల్‌తో కొంతకాలం డేటింగ్ చేసారు. దశాబ్దాల క్రితం క్రితం వీరిద్దరూ ప్రేమించుకున్నారు. కొంతకాలం డేటింగ్ చేశారు. ఆ తర్వాత విడిపోయారు. కానీ, స్నేహాన్ని మాత్రం కొనసాగించారు. 
 
అయితే, సిమి గరేవాల్‌తో డేటింగ్ విషయాన్ని రతన్ టాటా ఓసారి బయటపెట్టారు. బాలీవుడ్‌లో క్రియాశీలంగా ఉన్న సమయంలో కొంతకాలం తాము డేటింగ్‌లో ఉన్నట్టు ఆయన స్వయంగా వెల్లడించారు. ఆ తర్వాత విభేదాల కారణంగా దూరమైన స్నేహితులుగా మాత్రం కలిసివున్నామని తెలిపారు. 
 
అలాగే, సిమి కూడా రతన్ టాటా మృతిపై స్పందించారు. తాజాగా తామిద్దరూ కలిసున్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశారు. 'నీవు వెళ్లిపోయావని వారు చెబుతున్నారు. కానీ, నిన్ను కోల్పోయిన బాధను భరించడం కష్టం. వీడ్కోలు నేస్తమా' అని ఆ ఫొటోకు క్యాప్షన్ తగిలించారు.