ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (17:10 IST)

సన్నాఫ్ సత్యమూర్తి ఎంతసేపో...? ఐపీఎల్ వర్సెస్ సత్యమూర్తి...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. ఈ చిత్రం పైన ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇంతకుముందు రేసుగుర్రం విజయంతో దుమ్మురేపిన బన్నీ, అత్తారింటికి దారేది చిత్రంతో సూపర్ సక్సెస్ బాటలో ఉన్న స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సన్నాఫ్ సత్యమూర్తిపై ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎడిటింగ్ అనంతరం 162 నిమిషాలు ఉన్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కూడా ముగించుకుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9వ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐతే ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమయ్యే తర్వాతినాడే ఈ చిత్రం విడుదల కానుండటంతో ఐపీఎల్ వర్సెస్ సత్యమూర్తిగా ఉండబోతోంది ఇక్కడ.

 
అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు; సాంకేతిక వర్గం- పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శ్రీను, ఆర్ట్ - రవీందర్, మ్యూజిక్  - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్
 
ట్రెయిలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 
video platform video management video solutions video player