సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

"గని" నుంచి మరో రెండు పోస్టర్స్ రిలీజ్ - 15న టీజర్ రిలీజ్

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని మూవీ చేస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న గని సినిమాలో వరుణ్ తేజ్ మొదటి సారిగా బాక్సర్‏గా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో.. అల్లు బాబీ నిర్మిస్తున్నారు.
 
గ‌ని చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సాయి ముంజ్రేకర్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. న‌వీన్ చంద్ర, జ‌గ‌ప‌తిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. న‌దియా మ‌రో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 3న విడుదల చేయనున్నారు. దీంతో ప్ర‌మోషన్స్ వేగ‌వంతం చేశారు.
 
ఇంతకుముందు ‘గని వరల్డ్’ అంటూ.. సినిమాలోని ప్రధాన తారాగణాన్ని వెల్లడించిన చిత్ర బృందం.. ఇప్పుడు ఉపేంద్ర, సునీల్ శెట్టి పాత్రల పేర్లేంటి అనే విషయాన్ని పోస్ట‌ర్ ద్వారా తెలిపారు. 
 
విక్రమాదిత్యగా ఉపేంద్ర నటిస్తుండగా.. విజేంద్ర సిన్హగా సునీల్ శెట్టి కనిపించనున్నారు. ఈ ఇద్దరి పాత్రలు సినిమాకి చాలా కీలకం అంటున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న 'గని' చిత్ర టీజ‌ర్ రేపు విడుద‌ల కానుంది.