ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 మే 2024 (20:35 IST)

పెళ్లి పీటలెక్కనున్న హాట్ యాంకర్ శ్రీముఖి

Sreemukhi
తెలుగు బుల్లితెర నటి హాట్ యాంకర్ శ్రీముఖి త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. తొలుత సినీ నటిగా కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి ఆ తర్వాత యాంకర్‌గా మారింది. పటాస్ వంటి ప్రోగ్రామ్‌తో క్రేజ్‍‌ తెచ్చుకున్న శ్రీముఖి... ఆ తర్వాత పలు షోలతో టాప్ యాంకర్‍‌గా అవతరించింది. ప్రస్తుతం ఆమె చేతిలో 4, 5 షోలు ఉన్నాయి. పలు తెలుగు టీవీ చానెళ్ళలో ఆమె షోలు చేస్తుంది. 
 
మరోవైపు, శ్రీముఖి వయసు మూడు పదులు దాటిపోతుంది. ఆమె పెళ్లి ఎపుడా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆమె పెళ్లిపై జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. ఓ యూట్యూబ్‍‌ చానెల్‍‌కి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, శ్రీముఖి తల్లిదండ్రులు ఆమెకు సంబంధాలు చూస్తున్నారని తెలిపాడు. ఈ యేడాది ఆమె పెళ్లి జరిగే అవకాశం ఉందని చెప్పాడు. శ్రీముఖి నచ్చిన కుర్రాడు దొరికితే పెళ్లి అయిపోతుందని తెలిపాడు.