నోటికి పనిచెప్పిన శ్రీరెడ్డి.. అమలాపాల్‌ను ఆయన బాగా చూసుకుంటాడట..? (video)

Amala Paul
Amala Paul
సెల్వి| Last Updated: బుధవారం, 1 ఏప్రియల్ 2020 (19:58 IST)
క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేసి.. అర్ధ నగ్న ప్రదర్శనతో నానా హంగామా సృష్టించిన శ్రీరెడ్డి ప్రస్తుతం కోలీవుడ్‌లో మకాం వేసింది. టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో అవకాశాలు లేకపోవడంతో.. ప్రస్తుతం కోలీవుడ్‌పై దృష్టి మళ్లించింది.

ప్రస్తుతం తెలుగులో శ్రీరెడ్డి ఓ సినిమా చేస్తుందని.. తమిళంలో రెండు మూడు సినిమాలు చేతిలో వున్నాయని జనం చెప్పుకుంటున్నారు. కానీ ఎప్పటికీ నోటి దురుసు ఎక్కువని నిరూపించుకుంటున్న శ్రీరెడ్డి అప్పుడప్పుడు తనకు తోచిన వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వుంటుంది. తాజాగా శ్రీరెడ్డి అమలా పాల్ రెండో వివాహంపై స్పందించింది.

నటి అమలాపాల్ ఇటీవల తన ప్రియుడు, పంజాబీ గాయకుడు భవ్నీందర్ సింగ్ ను వివాహం చేసుకున్నట్టుగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అమలాపాల్ వివరణ ఇస్తూ, తానేమీ పెళ్లి చేసుకోలేదని, అవి ఫొటో షూట్ కోసం దిగినవని స్పష్టం చేసింది.
దీనిపై స్పందించిన శ్రీరెడ్డి.. బాధపడకు అమలాపాల్ అంటూ తెలిపింది. పంజాబీ భర్త అమలాపాల్‌ను బాగానే చూసుకుంటాడని.. తనకు పంజాబీలపై నమ్మకం వుందని కామెంట్స్ చేసింది. అయితే శ్రీరెడ్డి కామెంట్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ఆందోళనలో వుండగా.. ఇలాంటి పోస్టులతో అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నారు.

శ్రీరెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో నోటికి పనిచెప్పకుండా వుంటేనే మంచిదని హితవు పలుకుతున్నారు. కాగా.. కాగా, అమలాపాల్, 2014లో దర్శకుడు విజయ్‌ని పెళ్లాడి, ఆపై విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఆపై విజయ్ మరో పెళ్లి చేసుకోకున్నారు కూడా. అయితే అమలా పాల్ రెండో వివాహం చేసుకుంటానని చెప్పుకుంటూ వచ్చింది. ఇటీవల వివాహానికి సంబంధించిన ఫోటోలు రిలీజ్ కావడంతో ఆమెకు పెళ్లైపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అది ఫోటో షూట్ అని అమలాపాల్ తేల్చేసింది.దీనిపై మరింత చదవండి :